Uttarakhand | దక్షిణాదిలో ఎండలు మండిపోతుంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో నిరంతరం మంచు కురుస్తోంది. దీంతో అక్కడక్కడా అవలాంచ్‌లు (Avalanche) సంభవిస్తున్నాయి. ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని చమోలి (Chamoli) జిల్లాలో గత వారం మంచు చరియలు విరిగిపడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా చమోలి, రుద్రప్రయాగ్, పిథోగఢ్ జిల్లాల్లో సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలకు అధికారులు అవలాంచ్ హెచ్చరికలు చేశారు. రాబోయే 24 గంటల్లో ఇక్కడ మంచు చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ మేరకు చమోలి, రుద్రప్రయాగ్, పిథోగఢ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా ఉత్తరకాశీ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోని చంబా, లాహౌల్ స్పితి, కులు కిన్నౌర్ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ హెచ్చరికలు చేశారు. ఇక జమ్ము కశ్మీర్, లఢఖ్‌లోని గండేర్బల్, బారాముల్లా, కుప్వారా, రాజౌరి, పూంచ్ ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చారు.
కాగా, మార్చి 1వ తేదీన ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని చమోలి జిల్లా మనా గ్రామంలో మంచు చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికుల శిబిరంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో శిబిరంలో దాదాపు 60 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతావారిని అధికారులు రక్షించి ఎయిర్‌లిఫ్ట్‌తో జోషి మఠ్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.
Also Read..
Infosys | ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
Child marriage | 14 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి.. భర్తతో వెళ్లేందుకు నిరాకరించడంతో