Film ticket | సినిమా ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో (all theatres) సినిమా టికెట్ల (Film ticket)ను రూ.200కే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) కీలక ప్రకటన చేశారు.
2025-26కు సంబంధించిన కర్ణాటక బడ్జెట్ (Karnataka Budget)ను నేడు ప్రవేశపెట్టారు. రూ.4,08,647 కోట్ల బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువచ్చారు. మౌలిక సదుపాయాలు, సినిమా ప్రమోషన్స్, మహిళా సాధికారికత వంటి అంశాల గురించి ఈసారి బడ్జెట్లో కీలకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ బడ్జెట్లో సినీ రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించారు.
రాష్ట్రంలోని అన్ని మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో సినిమా టికెట్ ధరను రూ.200కే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా కన్నడ సినిమాల ప్రచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని కూడా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం ప్రకటించారు.
Also Read..
Uttarakhand | 24 గంటల్లో మంచు చరియలు విరిగిపడే ప్రమాదం.. ఉత్తరాఖండ్ సహా పలు ప్రాంతాలకు అలర్ట్
Infosys | ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
Child marriage | 14 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి.. భర్తతో వెళ్లేందుకు నిరాకరించడంతో