న్యూఢిల్లీ : మహిళ ఏడ్చినంత మాత్రానికి ఆమెను ఆమె భర్త, బంధువులు వరకట్న వేధింపులకు గురి చేసినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఈ కేసులో మహిళకు 2010 లో వివాహం జరిగింది. 2014 మార్చి 31న ఆమె మరణించారు. మృతురాలి సోదరి ఇచ్చిన వాంగ్మూలంలో, హోలి పండుగ సందర్భంగా తాను తన సోదరికి ఫోన్ చేశానని, అప్పుడు ఆమె ఏడ్చిందని తెలిపారు.
అయితే, ట్రయల్ కోర్టు తీర్పు చెప్తూ, భర్తను, అతని బంధువులను నిర్దోషులుగా ప్రకటించింది. ఆమె నిమోనియాతో సహజ కారణంతోనే మరణించారని తెలిపింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్తూ, మహిళ ఏడ్చినంత మాత్రానికి వరకట్న వేధింపుల కేసు కాబోదన్నారు.