జైపూర్: మహిళ, ఆమె ప్రియుడిపై భర్త బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన వారిద్దరూ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. (Woman, Lover Burnt Alive) మోఖంపురా ప్రాంతంలోని బరోలావ్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల సోని భర్త ఆరేళ్ల కిందట మరణించాడు. ఆమెకు పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. పదేళ్ల కుమారుడికి బాల్య వివాహం జరిగింది.
కాగా, అదే ప్రాంతానికి చెందిన వివాహితుడైన 25 ఏళ్ల కైలాష్ గుర్జార్, సోని మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నవంబర్ 28న అర్థరాత్రి వేళ పొలంలోని మంచెపై వీరిద్దరూ కలుసుకున్నారు. సోని భర్త తరుఫు బంధువులు అక్కడకు చేరుకున్నారు. వారిద్దరిని కొట్టి అక్కడ కట్టేశారు. వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
మరోవైపు తీవ్రంగా కాలిన గాయాలైన సోని, కైలాష్‌ను జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 1న కైలాష్ మరణించగా, బుధవారం తెల్లవారుజామున సోని చనిపోయింది. దీంతో వీరిద్దరి హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కైలాష్ హత్యపై గ్రామస్తులు నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా, గత ఏడాడి సోని బావ కుమారుడు, కైలాష్ సోదరుడి కుమార్తె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోని భర్త కుటుంబం, కైలాష్ కుటుంబం మధ్య గొడవల కారణంగా వీరిద్దరిని హత్య చేశారని పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman Kills Girl | అందంగా ఉన్నదని బాలికను చంపిన మహిళ.. గతంలో కొడుకుతో సహా ముగ్గురు పిల్లలు హత్య
Watch: కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం.. హాస్పిటల్స్‌కు వ్యాపించిన మంటలు, పిల్లలను రక్షించిన స్థానికులు
Watch: కారు రివర్స్ చేసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?