కేవలం 24 గంటల్లోనే భారత సైన్యం తన తడాఖా చూపించింది. కశ్మీర్ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్‌ను హత్య చేసిన ఉగ్రవాదులను శుక్రవారం భారత సైన్యం ఎన్కౌంటర్ చేసేసింది. రాహుల్ భట్‌ను చంపిన ఉగ్రవాదులను 2 రోజుల్లోగా గుర్తించి, ఎన్కౌంటర్ చేస్తామని ఆర్మీ ఆయన భార్యకు హామీ ఇచ్చింది.
హామీ ఇచ్చిన ఒక్క రోజులోనే భారత సైన్యం రాహుల్ భట్‌ను చంపిన ఉగ్రవాదుల ప్రాణాలు తీసేసింది. బందీపూరాలో ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. ఈ ముగ్గురిలో ఇద్దరు రాహుల్ భట్‌ను హత్య చేయడంలో పాత్ర పోషించిన వారేనని అధికారులు పేర్కొంటున్నారు.
జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు తహసీల్దార్ కార్యాలయంలోని చొరబడి కశ్మీర్ పండిట్ ఉద్యోగిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం కార్యాలయంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పులతో ఉద్యోగుల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. ఆ తర్వాత పలువురు ఉద్యోగులు రాహుల్ భట్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రాహుల్ భట్‌ను శ్రీనగర్‌కు రెఫర్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.