బీజేపీలో చేరిన మాజీ సీఎం చవాన్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 65 ఏండ్ల చవాన్‌కు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో సాదర స్వాగతం లభించింది.
- రేపు రాజ్యసభకు నామినేషన్
ముంబై, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 65 ఏండ్ల చవాన్‌కు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో సాదర స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సహా కీలక నేతలు చవాన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఇదో కొత్త దశ అని చవాన్ పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న చవాన్ ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకున్నారు.
అశోక్ చవాన్‌కు రాజ్యసభ సీటు ఇస్తారనే ఊహాగానాల మధ్య ఆయన బీజేపీ గూటికి చేరుకోవటం గమనార్హం. బుధవారం ఆయన రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. బీజేపీ అశోక్ చవాన్‌ను రాజ్యసభకు పంపినట్టయితే అది అమరవీరులైన సైనికులను అవమానించినట్టేనని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. అయితే తన 38 ఏండ్ల రాజకీయ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి.. కొన్ని మంచి పనులు చేయాలని, ప్రగతిశీల ఆలోచనలతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్టు అశోక్ చవాన్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

