సీజేఐగా పదవీ విరమణ చేసిన తరువాత అధికారిక లేదా అనధికారిక బాధ్యతలేవీ చేపట్టబోనని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. కోర్టు ఆవరణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తరువాత ఎటువంటి పదవినీ స్వీకరించబోనని, అయితే చట్టానికి సంబంధించి ఏదో ఒకటి చేస్తానని స్పష్టం చేశారు. ‘నాకు మూడో ఇన్నింగ్స్ ఉంటుంది, అప్పుడు చట్టానికి సంబంధించి ఏదైనా చేస్తాను’ అన్నారు. సీజేఐగా ఆయన మంగళవారం పదవీ విరమణ చేశారు.
సుప్రీంకోర్టు ఆవరణలో బార్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ.. తన తదుపరి వారసుడు జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు విలువలను, ప్రాథమిక హక్కులను, రాజ్యాంగం మౌలిక సూత్రాలను కాపాడతారని ఆశాభావం వ్యక్తంచేశారు.