పాట్నా: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి (Rabri Devi) రెండు దశాబ్దాలకు పైగా నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయబోరని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఏం చేసుకుంటారో చేసుకోండని తెగేసి చెప్పింది. పాట్నాలోని అన్నే మార్గ్‌లో ముఖ్యమంత్రి అధికారిక నివాసం 1కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ బంగ్లాలో రెండు దశాబ్దాలకు పైగా రబ్రీ దేవి, లాలూ నివాసముంటున్నారు. అయితే దానిని ఖాళీ చేయాలని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. శాసన మండలిలో ప్రతిపక్ష నేతకు కేటాయించిన హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు ఆమె మారాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఆర్జేడీ దీనిపై స్పందించింది. మాజీ ముఖ్యమంత్రులకు ‘జీవితకాల’ నివాసం కింద కేటాయించిన ఆ ప్రభుత్వ బంగ్లాను రబ్రీ దేవి ఖాళీ చేయబోరని పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ మంగని లాల్ మండల్ తెలిపారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేతకు ఇప్పుడు కొత్తగా నివాసాన్ని ఎందుకు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రులకు ‘జీవితకాల’ నివాసాన్ని అలహాబాద్ హైకోర్టు గతంలో రద్దు చేసిందని మంత్రి సంతోష్ కుమార్ సుమన్ తెలిపారు. అలాగే ఎవరికి ఏ బంగ్లా కేటాయించాలో అన్నది నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు.
Also Read:
Child On Car Roof | బైక్‌ను ఢీకొట్టిన కారు.. దాని టాప్‌పై పడిన బాలుడు, అలాగే నడిపిన డ్రైవర్
Karnataka Seer Acquitted | బాలికలపై లైంగిక దాడి కేసులో.. కర్ణాటక మఠాధిపతి నిర్దోషి
Watch: ఆక్రమణల డ్రైవ్‌లో మెట్లు కూల్చివేత.. బ్యాంకు కస్టమర్లు ఎలా చేరుకున్నారంటే?