న్యూఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తులకు చెందిన రెండు కోట్లకుపైగా ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. (Aadhaar Card Deactivate) ఆధార్ రికార్డుల ఖచ్చితత్వం, దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం ఈ చర్య చేపట్టినట్లు పేర్కొంది. అయితే డీయాక్టివేట్ చేసిన మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్లను ఇతరులకు కేటాయించబోమని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం వెల్లడించింది.
కాగా, భారత రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాల ద్వారా చనిపోయిన వ్యక్తుల గురించి సమాచారం సేకరించినట్లు ఆధార్ సంస్థ తెలిపింది. భవిష్యత్తులో బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి కూడా ఈ సమాచారం సేకరించనున్నట్లు వివరించింది. వ్యక్తుల మరణాన్ని ధృవీకరించిన తర్వాత వారి ఆధార్ కార్డుల సమాచారాన్ని ఆధార్ సిస్టమ్‌లో డీయాక్టివేట్ చేయనున్నట్లు పేర్కొంది.
మరోవైపు కుటుంబ సభ్యుల మరణ ధృవీకరణ పత్రం అందుకున్న తర్వాత కొత్తగా ప్రారంభించిన ‘మైఆధార్’ పోర్టల్‌లో ఆ వివరాలు వెల్లడించాలని దేశ ప్రజలను ఆధార్ సంస్థ కోరింది. సకాలంలో నివేదించడం వల్ల ఆధార్ ఆధారిత ప్రభుత్వ సబ్సిడీలు, సేవలు దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చని సూచించింది.
Also Read:
Karnataka Seer Acquitted | బాలికలపై లైంగిక దాడి కేసులో.. కర్ణాటక మఠాధిపతి నిర్దోషి
Child On Car Roof | బైక్‌ను ఢీకొట్టిన కారు.. దాని టాప్‌పై పడిన బాలుడు, అలాగే నడిపిన డ్రైవర్
Watch: ఆక్రమణల డ్రైవ్‌లో మెట్లు కూల్చివేత.. బ్యాంకు కస్టమర్లు ఎలా చేరుకున్నారంటే?