న్యూఢిల్లీ: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిసెంబర్ 15వ తేదీ నుంచి జర్మనీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ పర్యటన్ అయినట్లు బీజేపీ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు ఇవాళ రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత గురించి ఎందుకు అడుగుతున్నారని, ప్రధాని మోదీ తన సగం పనిదినాలను దేశం బయటే గుడుపుతున్నట్లు ప్రియాంకా ఆరోపించారు.
డిసెంబర్ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాహుల్ గాంధీ జర్మనీలో భారతీయులతో భేటీకానున్నారు. జర్మనీ మంత్రుల్ని కూడా ఆయన కలవనున్నారు. రాహుల్ ఈజ్ ఎల్వోపీ అంటే లీడర్ ఆఫ్ పర్యటన్ అని బీజేపీ పేర్కొన్నది. విదేశీ నాయకుడు తన నచ్చిన అంశాన్ని చేస్తున్నారని, విదేశీ టూరుకు వెళ్తున్నారని, శీతాకాల పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకు ఉన్నాయని, కానీ రాహుల్ గాంధీ మాత్రం డిసెంబర్ 15 నుంచి 20 వరకు జర్మనీకి వెళ్తున్నట్లు బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల సమయంలోనూ రాహుల్ విదేశాల్లో ఉన్నారని, జంగిల్ సఫారీ చేసినట్లు ఆరోపించారు.
రాహుల్ గాంధీపై వస్తున్న విమర్శల గురించి అడిగిన సమయంలో ప్రియాంకా గాంధీ స్పందించారు. దేశం బయటే తన సగం దినాలను ప్రధాని మోదీ గడిపేస్తున్నారని, మరి ప్రతిపక్ష నేతపై ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారని ప్రియాంకా అన్నారు. జర్మనీ టూరులో రాహుల్ గాంధీతో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్పర్సన్ సామ్ పిట్రోడా కూడా వెళ్తున్నారని బల్విందర్ సింగ్ తెలిపారు.
राहुल गांधी की |
विदेश में छुट्टी मनाने वाली यात्रा को |
प्रधान मंत्री के विदेश दौरों से तौल रही प्रियंका |
इनको कौन समझाएं कि जिन यात्रा में यह मौज लेते हैं |
ऐसी यात्रा कर मोदी देश को हर बार नई नई सौगात देते हैं |
जिस अमेरिका के सामने यह गिरगिड़ाते थे मोदी भाव नहीं देते… pic.twitter.com/vF1VXtbIYy
— THE JAT ASSOCIATION (@Jatassociation) December 10, 2025