Jairam Ramesh | మణిపూర్‌లో పర్యటించేందుకు మోదీకి సమయం దొరకడం లేదు : జైరాం రమేశ్
Jairam Ramesh | ప్రధాని మోదీ (Pm Modi)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటించేందుకు మోదీకి సమయం దొరకడం లేదంటూ విమర్శించారు.
Jairam Ramesh | ప్రధాని మోదీ (Pm Modi)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటించేందుకు మోదీకి సమయం దొరకడం లేదంటూ విమర్శించారు. మణిపూర్‌లో నెలకొన్న కల్లోల పరిస్థితులను పరిశీలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక్క రోజు సమయం కూడా ఎందుకు దొరకడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్న ప్రధాని మణిపూర్‌లో పర్యటించకపోవడం బాధాకరమన్నారు. ఆయన మణిపూర్ రాష్ట్రాన్ని విడిచిపెట్టారని.. అధికారంలోకి రావడానికి మాత్రమే ఆరాటపడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.
కాగా, కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు నాలుగు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈఏడాది జూలైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు తాజాగా వెల్లడైంది. సాయుధ మూకల చేతిలో వారు హత్యకు గురైనట్లు తేలింది. వారి మృతదేహాల ఫొటోలు ఇంటర్నెట్పై ఆంక్షలు ఎత్తివేయడంతో వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ ఘటనకు నిరసనగా వందలాది విద్యార్థులు నిరసన చేపట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం నుంచి రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు మరో ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Also Read..
Google | గూగుల్ 25వ వార్షికోత్సవం నేడు.. ప్రత్యేక డూడుల్
Salt usage | ఉప్పు తెగ తింటున్న భారతీయులు.. గుండెపోటు, స్ట్రోక్స్, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
Sampath Nandi | పవన్ కల్యాణ్‌తో సినిమా చేయని సంపత్ నంది.. కారణం ఏంటో తెలుసా..?
Karthika Pournami | వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ.. దర్శనానికి బారులు తీరిన భక్తులు
Vidadala Rajini | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైసీపీ మాజీ మంత్రి రజిని
Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

