National Testing Agency 2024 | ఎన్టీఏ 2024 ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల.. నీట్, జేఈఈ, నెట్ పరీక్షలు ఎప్పుడంటే
National Testing Agency | దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో యూజీ ఇంజినీరింగ్ (JEE), మెడిసిన్ (NEET) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలతోపాటు యూజీసీ- నెట్ (UGC-NET) పరీక్షల క్యాలెండర్‌ను ఎన్టీఏ విడుదల చేసింది ఆ వివరాలు సంక్షిప్తంగా నమస్తే తెలంగాణ పాఠకుల కోసం...
National Testing Agency | దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో యూజీ ఇంజినీరింగ్ (JEE), మెడిసిన్ (NEET) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలతోపాటు యూజీసీ- నెట్ (UGC-NET) పరీక్షల క్యాలెండర్‌ను ఎన్టీఏ విడుదల చేసింది ఆ వివరాలు సంక్షిప్తంగా నమస్తే తెలంగాణ పాఠకుల కోసం…
జేఈఈ (మెయిన్) 2024 సెషన్-1
- దేశంలో ఇంజినీరింగ్ విద్యకు పేరుగాంచిన ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలతోపాటు ఐఐటీలో ప్రవేశానికి నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అర్హత కోసం దీన్ని నిర్వహిస్తారు.
- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెయిన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా యూజీ ఇంజినీరింగ్ ప్రవేశాలను కల్పిస్తారు.
- జేఈఈ మెయిన్‌లో టాప్-20 పర్సంటైల్‌లో వున్నవారు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు
- ఏటా ఈ పరీక్షను రెండుస్లారు నిర్వహిస్తారు
జేఈఈ మెయిన్ సెషన్-1 - ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీన్ని 2024, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించనున్నారు
జేఈఈ మెయిన్ సెషన్-2 - ఈ పరీక్షను 2024, ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య నిర్వహిస్తారు
నీట్-2024
- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)- యూజీ పరీక్షను ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు
- ఇది పెన్, పేపర్/ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తారు.
- ఈ పరీక్షను 2024, మే 5న నిర్వహిస్తారు
సీయూఈటీ-యూజీ 2024
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ)-2024
- దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు పలు ఇతర యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు
- ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
- దీన్ని 2024, మే 15 నుంచి మే 31 మధ్యలో నిర్వహించనున్నారు
సీయూఈటీ – పీజీ 2024
- పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్ష ఇది.
- ఇది సీబీటీ విధానంలో నిర్వహిస్తారు
- 2024, మార్చి 11 నుంచి 28 మధ్య నిర్వహిస్తారు
యూజీసీ-నెట్ (సెషన్ -1)
- లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు అర్హతతోపాటు జేఆర్ఎఫ్ కోసం నిర్వహించే పరీక్ష ఇది.
- ఏటా దీన్ని రెండుసార్లు నిర్వహిస్తారు.
- దీన్ని సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తారు
- నెట్ సెషన్-1ను పరీక్షను 2024, జూన్ 10 నుంచి జూన్ 21 మధ్య నిర్వహిస్తారు
నోట్: పరీక్షల దరఖాస్తు, ఇన్ఫర్మేషన్ బులిటిన్‌ను ఎన్టీఏ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది - సీబీటీ పరీక్షల ఫలితాలను పరీక్ష నిర్వహించిన మూడువారాల్లో ఎన్టీఏ ప్రకటిస్తుంది
- నీట్ యూజీ పరీక్ష ఫలితాలను ఎన్టీఏ 2024 జూన్‌లో వెల్లడిస్తుంది.
పూర్తి వివరాల కోసం
వెబ్సైట్: https://www.nta.ac.in
కేశవపంతుల వేంకటేశ్వర శర్మ
Read Today's Latest Entrance-exams News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

