Google | గూగుల్ 25వ వార్షికోత్సవం నేడు.. ప్రత్యేక డూడుల్
Google | గూగుల్ (Google) నేడు 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్ డూడుల్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటోంది.
Google | గూగుల్ (Google).. ఈ పేరు తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరికీ ఈ గూగుల్ సుపరిచితమే. ఇంటర్నెట్లో ఏదైనా వెతకాలంటే ముందుగా మనకు గుర్తొచ్చేది గూగుల్. సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్ ఇలా ఒకటేంటి సకలం ఇందులో లభిస్తాయి. ఆఖరికి ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్లాలన్న గూగుల్ మ్యాప్‌తో ఎంతో ఈజీగా చేరుకోగలుగుతున్నాం. అంతటి ప్రాముఖ్యత కలిగింది గూగుల్. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో గూగుల్ భాగమైపోయింది. ఇంతకీ ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా..? ఏమీ లేదండీ.. నేడు గూగుల్ 25వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గూగుల్ డూడుల్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటోంది.
సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట అంటే 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్ ఆవిర్భవించింది. అయితే, గూగుల్ తన పుట్టినరోజును ఏటా సెప్టెంబర్ 27వ తేదీన జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భానికి గుర్తుగా ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత గూగుల్ డూడుల్ మారిపోయింది. Google స్థానంలో తన 25వ వార్షికోత్సవాన్ని తెలియజేస్తూ G25gle అనే అక్షరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఈ డూడుల్ ఆకట్టుకుంటోంది.
అమెరికాకు చెందిన లారీ పేజ్, సర్జీ బ్రిన్ స్టోన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థులుగా ఉన్నప్పుడు 1998 సెప్టెంబర్ 4న ఈ సంస్థను స్థాపించారు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ అమెరికన్ సంస్థ.. నేడు వరల్డ్ టాప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. గూగుల్‌లో రోజూ ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా భాషల్లో మిలియన్ల కొద్దీ శోధనలు జరుగుతున్నాయి. ఇక ఈ సంస్థకు భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ సీఈఓగా నియమితులైన విషయం తెలిసిందే. 2015లో ఆయన గూగుల్ బాధ్యతలను స్వీకరించారు. గూగుల్ మొదటి ఏడేళ్లు సెప్టెంబర్ 4నే వార్షికోత్సవం నిర్వహించింది. కానీ, రికార్డుల ఆధారంగా 2005 నుంచి సెప్టెంబర్ 27కి మార్చింది.
Also Read..
New study | 25 కోట్ల ఏండ్లలో మానవాళి అంతం.. శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడి
Rains in Telangana | రాష్ట్రంలో ఐదు రోజులు వానలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

