Home
News
Scientists Predict That Earth Will See A Mass Extinction That Wipes Out All Humans In 25 Billion Years
New study | 25 కోట్ల ఏండ్లలో మానవాళి అంతం.. శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడి
New study | మానవులందర్నీ తుడిచిపెట్టే సామూహిక వినాశనాన్ని భూమి 25 కోట్ల సంవత్సరాల్లో చూడబోతున్నదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఖండాలన్నీ అత్యంత సమీపానికి వస్తాయని, అప్పుడు ఏర్పడే ‘సూపర్ కాంటినెంట్'లో అధిక వేడి, ఉష్ణోగ్రతల కారణంగా జీవరాశి మనుగడ సాధ్యం కాదని ‘యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్' సైంటిస్టులు అంచనావేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: మానవులందర్నీ తుడిచిపెట్టే సామూహిక వినాశనాన్ని భూమి 25 కోట్ల సంవత్సరాల్లో చూడబోతున్నదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఖండాలన్నీ అత్యంత సమీపానికి వస్తాయని, అప్పుడు ఏర్పడే ‘సూపర్ కాంటినెంట్’లో అధిక వేడి, ఉష్ణోగ్రతల కారణంగా జీవరాశి మనుగడ సాధ్యం కాదని ‘యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్’ సైంటిస్టులు అంచనావేశారు. శిలాజ ఇంధనాల్ని మండించటం, మానవ ప్రమేయంతో జరిగే కాలుష్యాన్ని అడ్డుకోవాలని, లేదంటే సామూహిక వినాశనం మరింత ముందుకు జరుగుతుందని పరిశోధనల్లో పాల్గొన్న ప్రొఫెసర్ బెంజమిన్ మిల్స్ చెప్పారు. ఈ నివేదిక ప్రకారం, 40 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్ని భరించే జీవరాశి మాత్రమే 25 కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై మనుగడ సాగించగలవు. సూపర్ కాంటినెంట్గా ఏర్పడటాన్ని సైంటిస్టులు ‘పాంజియా అల్టీమా’గా పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Earth
- Scientists
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

