Bird Flu | సాధారణంగా పక్షులకు సంక్రమించే బర్డ్ ఫ్లూ (Bird Flu) వ్యాధి ప్రస్తుతం మానవుల్లో కూడా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్ (2019లో తొలి కేసు), చైనా, మెక్సికో వంటి దేశాల్లో ఇలాంటి కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది.
భారత్‌లో 2019 తర్వాత రెండో బర్డ్ ఫ్లూ కేసు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) మంగళవారం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నాలుగేళ్ల చిన్నారి హెచ్9ఎన్2 రకం వైరస్ ( H9N2 virus) బారిన పడినట్లు తెలిపింది. తీవ్రమైన శ్వాసకోశ సమస్య, అధిక జ్వరం, పొత్తికడుపు తిమ్మిరి వంటి సమస్యలతో చిన్నారి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరినట్లు డబ్ల్యూహెవ్వో పేర్కొంది. చికిత్స తర్వాత మూడు నెలల తర్వాత డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.
చిన్నారి ఇంటి పరిసరాల్లో కోళ్లు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. చిన్నారి కుటుంబ సభ్యులు ఎవరికీ ఈ వ్యాధి సంబంధిత లక్షణాలు లేవని వెల్లడించింది. హెచ్9ఎన్2 వైరస్ వ్యాధి లక్షణాల తీవ్రత ఓ మోస్తరుగా ఉంటుందని తెలిపింది. కాగా, భారత్‌లో మనుషుల్లో తొలి బర్డ్‌ఫ్లూ కేసు 2019లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. తాజా కేసు రెండోదికావడం గమనార్హం.
Also Read..
Heat wave | ఉత్తరాదిలో నిప్పులు చెరుగుతున్న భానుడు.. మండుతున్న ఎండలు
UGC | ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు వర్సిటీల్లో ప్రవేశాలు.. యూజీసీ కీలక నిర్ణయం
Jammu Kashmir: జమ్మూలో మరో టెర్రర్ అటాక్.. ఎన్కౌంటర్లో ఆరుగురు జవాన్లకు గాయాలు