UGC | ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు వర్సిటీల్లో ప్రవేశాలు.. యూజీసీ కీలక నిర్ణయం
UGC | విదేశాల్లోని విశ్వవిద్యాలయాల తరహాలోనే ఇక నుంచి దేశంలోని యూనివర్సిటీల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఏటా రెండుసార్లు అడ్మిషన్లు జరపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని యూజీసీ ఛైర్మన్ ఆచార్య జగదీశ్ కుమార్ తెలిపారు.
UGC : విదేశాల్లోని విశ్వవిద్యాలయాల తరహాలోనే ఇక నుంచి దేశంలోని యూనివర్సిటీల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఏటా రెండుసార్లు అడ్మిషన్లు జరపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని యూజీసీ ఛైర్మన్ ఆచార్య జగదీశ్ కుమార్ తెలిపారు. తొలి విడతలో జులై-ఆగస్టు, మలి విడతలో జనవరి-ఫిబ్రవరిలలో అడ్మిషన్లు జరుగుతాయని వెల్లడించారు.
అయితే ఈ విధానం తప్పనిసరి కాదని, ఐచ్ఛికమేనని స్పష్టం చేశారు. ‘ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్ల విధానం అమల్లోకి తేవడంతో.. వివిధ బోర్డుల ఫలితాల ప్రకటనలో జాప్యం, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలవల్ల జులై-ఆగస్టులలో ప్రవేశాలు పొందలేని విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులు మరుసటి ఏడాది వరకూ వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ద్వైవార్షిక ప్రవేశాలవల్ల కంపెనీలు ప్రాంగణ నియామకాలను ఏడాదికి రెండుసార్లు చేస్తాయి. దాంతో గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని జగదీశ్ కుమార్ వివరించారు.
‘రెండుసార్లు ప్రవేశాలు జరపడంవల్ల విద్యాసంస్థలు తమ వనరులను సమర్థంగా పంపిణీ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఫ్యాకల్టీ, ల్యాబ్లు, తరగతి గదులు, ఇతర అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు. ఫలితంగా వర్సిటీల వ్యవస్థలు అత్యుత్తమంగా పని చేయగలుగుతాయి’ అని యూజీ ఛైర్మన్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

