Exit Polls | జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కశ్మీర్లో మూడు దశల్లో జరగ్గా.. నేటితో ముగిసింది. ఇక హర్యానాలో ఒకే విడుదల పోలింగ్ జరిగింది. ఈ నెల 8న ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనున్నది. ఓటింగ్ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. హర్యానాలో ఈ సారి బీజేపీకి పరాభవం తప్పదని.. కాంగ్రెస్‌దే హవా అని పలు సర్వేలు పేర్కొన్నాయి. ఇక జమ్మూ కశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని పీపుల్స్ పల్స్ సౌత్ సర్వే చెప్పింది. హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, ఆర్టికల్ 376 ఎత్తిన తర్వాతన తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదని.. నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రం అతిపెద్ద పార్టీగా నిలచే అవకాశాలున్నట్లు పేర్కొంది. హర్యానాలో 90, జమ్మూ కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్‌కు 55, బీజేపీకి 26, ఐఎన్ఎల్డీ 2-3, బీజేపీకి ఒక స్థానంలో గెలిచే అవకాశాలున్నాయని చెప్పింది. సట్టా బజార్ సర్వేలో కాంగ్రెస్ 50, బీజేపీ 25 సీట్లు వస్తాయని.. ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో బీజేపీకి 78, కాంగ్రెస్ 8కి వస్తాయని తెలిపింది. న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్ సర్వేలో బీజేపీ-75, కాంగ్రెస్-10 వస్తాయని తెలిపింది.
పీపుల్స్ పల్స్ సర్వేలో జేకేఎన్-సీ 33-35, బీజేపీ 23-27, కాంగ్రెస్ 13-15, జేకే పీడీపీ 7-11, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 నుంచి సీట్లు గెలిచే అవకాశాలున్నాయని చెప్పింది. రిపబ్లిక్ మాట్రిజ్ సర్వే ప్రకారం.. బీజేపీకి 25, కాంగ్రెస్‌కు 12, ఎన్సీకి 15, పీడీపీకి 28, ఇతరులు ఏడు స్థానాల్లో గెలుస్తారని చెప్పింది. ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో ఎన్సీ కూటమికి 11-15, బీజేపీ 27-31, పీడీపీ 0-2, ఇతరులు 0-1 సీట్లు వస్తాయని పేర్కొన్నది.