PM Modi | న్యూఢిల్లీ, జూన్ 10: సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ మార్క్‌ను అందుకోలేక చతికిలపడ్డ బీజేపీ(240 స్థానాలు), త్వరలో వివిధ రాష్ర్టాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి సవాల్ ఎదురవుతుందని భావిస్తున్నది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న 5 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇచ్చారు. ఆదివారం 71 మందితో మంత్రివర్గం ఏర్పాటుచేయగా, ఇందులో 21 మంది మంత్రులు (30శాతం పదవులు) అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ర్టాల నుంచి ఉండటం గమనార్హం.
మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, బీహార్, ఢిల్లీ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలకు 2024, 2025లలో ఎన్నికలు రాబోతున్నాయి. హర్యానా, మహారాష్ట్ర, బీహార్‌లో ఎన్డీయేకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. కీలక రాష్ర్టాల్లో బీజేపీ గెలుపు మోదీ సర్కార్‌కు సవాలేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అంతేగాక ఈ రాష్ర్టాల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయి.