Independent Candidates | హైదరాబాద్ : పార్లమెంట్లో స్వతంత్ర అభ్యర్థుల ప్రాబల్యం ఏడాదికేడాది తగ్గుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లో కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారు. పోటీ చేసింది మాత్రం 3,195 మంది. స్వతంత్ర అభ్యర్థుల్లో బారాముల్లా నుంచి గెలుపొందిన అబ్దుల్ రషీద్ షేక్ అత్యధికంగా 2 లక్షల ఓట్ల పైచిలుకు మెజార్టీతో అఖండ విజయం సాధించారు. ఇంజినీర్ రషీద్ చేతిలో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఓటమి చవిచూశారు. ఇక డమన్ డయ్యూ నుంచి గెలుపొందిన పటేల్ ఉమేశ్ బాయ్ అత్యల్పంగా 6,225 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
2019లో నలుగురు, 2014లో ముగ్గురు ఇండిపెండెంట్లు మాత్రమే గెలిచారు. 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో 37 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 1957 లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది స్వతంత్ర ఎంపీలు గెలుపొందారు. 1962లో 20 మంది, 1967 ఎన్నికల్లో 35 మంది విజయం సాధించారు.
పూర్ణియా – రాజేశ్ రాజన్ అలియాస్ పప్పు యాదవ్(23,847 ఓట్ల మెజార్టీ)
సంగ్లీ – విశాల్ ప్రకాశ్ బాపు పాటిల్(1,00,053 ఓట్ల మెజార్టీ)
ఖదూర్ సాహీబ్ – అమృత్ పాల్ సింగ్(1,97,120 ఓట్ల మెజార్టీ)
ఫరీద్ కోట్ – సరబ్జిత్ సింగ్ ఖల్సా(70,053 ఓట్ల మెజార్టీ)
డామన్ డయ్యూ – పటేల్ ఉమేశ్ భాయ్ ( 6,225 ఓట్ల మెజార్టీ)
బారాముల్లా – అబ్దుల్ రషీద్ షేక్(2,04,142 ఓట్ల మెజార్టీ)
లడఖ్ – మహ్మద్ హనీఫా(27,862 ఓట్ల మెజార్టీ)