Sanjay Raut questions Raj Thackeray | ‘ఏ ఫైల్ తెరిచారు?’.. బీజేపీకి మద్దతుపై రాజ్ ఠాక్రేను ప్రశ్నించిన సంజయ్ రౌత్
Sanjay Raut questions Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. (Sanjay Raut questions Raj Thackeray) మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. (Sanjay Raut questions Raj Thackeray) మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే కూటమికి మాత్రమే తమ పార్టీ మద్దతు అని తెలిపారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ‘బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ’ మహాకూటమికి ఎంఎన్ఎస్ బేషరతుగా మద్దతిస్తుందని చెప్పారు. కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కాగా, బీజేపీకి బేషరతుగా మద్దతిస్తున్నట్లు రాజ్ ఠాక్రే ప్రకటించడంపై శివసేన (యుబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం స్పందించారు. దీని వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రాజ్ ఠాక్రేపై మోదీ ఏదో ఫైల్ తెరిచి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు అకస్మాత్తుగా ఏదో అద్భుతం జరిగింది. దీని గురించి ఆయన(రాజ్ ఠాక్రే)ను అడగాలి. మీరు హఠాత్తుగా యూటర్న్ తీసుకుని మహారాష్ట్ర శత్రువులకు మద్దతు ఇస్తున్నారు. ప్రజలకు మీరు ఏమి చెబుతారు? దీని వెనుక కారణం ఏమిటి? మీపై ఏదైనా ఫైల్ తెరిచారా?’ అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Opened
- questions
- Raj Thackeray
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

