అహ్మదాబాద్: మొరాయించిన బీజేపీ ప్రచార వాహనాన్ని తాడుతో కాంగ్రెస్ ప్రచార వాహనం లాగింది. ఎన్నికల వేళ గుజరాత్లో జరిగిన ఈ సంఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పాటు నెటిజన్లు సెటైర్లు వేశారు. గుజరాత్లో వరుసగా ఐదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. మరోవైపు గట్టి పోటీ ఇచ్చి పంజాబ్లో మాదిరిగా అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆప్ యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నికల సందడిలో జరిగిన ఒక సంఘటనపై సోషల్ మీడియాలో జోకులు వెల్లువెత్తాయి. బీజేపీ ప్రచార వాహనం రోడ్డు పక్కన ఉన్న బురదలో చిక్కుకుని కదిలేందుకు మొరాయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనం తాడు సహాయంతో బీజేపీ ప్రచార వాహనాన్ని లాగింది.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘గుజరాత్లో నిలిచిపోయిన బీజేపీ ఎన్నికల వాహనాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది’ అని ఆప్ కామెంట్ చేసింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎన్నికల ప్రేమాయణం (ఐఎల్యూ) అని వ్యాఖ్యానించింది. 1991 నాటి హిందీ చిత్రం ‘సౌదాగర్’లోని ‘ఐ లవ్ యూ’ పాటను గుర్తు చేసింది.
మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు కూడా తమదైన స్టైల్లో స్పందించారు. ‘కాంగ్రెస్ అంటే కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసేది. కాంగ్రెస్ ఎవరినీ ద్వేషించదు’ అని ఒకరు పేర్కొన్నారు. అయితే వర్కర్లైన వాహన డ్రైవర్లు ఒకరికొకరు సహకరించుకున్నారని, ప్రతి అంశాన్ని రాజకీయం, ఓట్ల కోణంలో చూడవద్దని, మానవత్వాన్ని చూడాలని మరొకరు హితవుపలికారు.
गुजरात में भाजपा की अटकी हुई चुनावी गाड़ी को बचाने में पूरा ज़ोर लगाती कांग्रेस..
ये है चुनावों में BJP और Congress के ILU-ILU की कहानी 🫶🏻💕 pic.twitter.com/nbBu7GjW6i
— AAP (@AamAadmiParty) November 12, 2022