వారణాసి: కాశీ విశ్వనాధ్ ఆలయ సుందరీకరణలో భాగంగా కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టారు. సుమారు రూ.339 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేస్తున్నారు. తొలి దశలో ఇవాళ కొన్ని పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. దాదాపు 5 లక్షల చదరపు ఫీట్లు ఉన్న విస్తీర్ణంలో సుమారు 23 బిల్డింగ్‌లను ప్రారంభించనున్నారు. గతంలో ఈ ప్రాంతంలో సుమారు 3000 చదరపు ఫీట్లు స్థలం ఇక్కడ వాడుకలో ఉండేది. కాశీకి వెళ్తున్న ప్రధాని మోదీ అక్కడ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటలకు కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రధాన పూజారి శ్రీకాంత్ మిశ్రా ఆధ్వరంలో పూజలు జరగనున్నాయి. లలితా ఘాట్ నుంచి కారిడార్లోకి మోదీ ఎంటర్ కానున్నారు. ఆ తర్వాత మంది పరిసరాల్లో ఆయన గడుపుతారు. శివ లింగానికి ఆయన గంగా జలాలను సమర్పించనున్నారు.
కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ఓ కొత్త థామంగా ప్రజెంట్ చేయనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వారణాసికి ఈ కారిడార్‌తో కొత్త గుర్తింపు రానున్నట్లు ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. కారిడార్ ఓపెనింగ్ ఆ ఎన్నికల జోరును పెంచనున్నది. ఈ ప్రాజెక్టు కోసం ఆలయం చుట్టు సుమారు 300 ప్రాపర్టీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1400 మంది షాపులను, కిరాయిదారులను, ఇంటి యజమానులకు మరో చట స్థానం కల్పించారు.
పురాతన కాలం నాటి ప్రాపర్టీలను తొలగిస్తున్న సమయంలో.. అక్కడ ఉన్న సుమారు 40 ప్రాచీన ఆలయాలను కూడా గుర్తించారు. అయితే ఆ ఆలయాలను మరింత శోభాయమానంగా సుందరీకంచినట్లు తెలుస్తోంది. కాశీ విశ్వనాథ్ కారిడార్ ఓపెనింగ్ సందర్భంగా సుమారు 3000 మంది పండితులను ఆహ్వానిస్తున్నారు. విభిన్న మఠాలు, పీఠాధిపతులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. గ్రాండ్‌గా కారిడార్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 55 హై డెఫినేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.