కోల్‌కతా: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు పశ్చిమ బెంగాల్లో విస్తరిస్తున్నాయి. ముర్షీదాబాద్‌లో హింసాత్మక నిరసనల తర్వాత తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాకు విస్తరించాయి. భంగర్ లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు.
పోలీసు వాహనాలను తగులబెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు హైవేపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.