West Bengal | కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెంగాల్ సర్కార్ అప్రమత్తమైంది. ఆంక్షలను మరింత కఠినం చేసింది. స్కూళ్లు, కాలేజీలతో సహా ఇతర ప్రాంతాలను సోమవారం నుంచి యూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకుంది. బెంగాల్ నుంచి ఢిల్లీ, ముంబై వెళ్లే విమానాలపై ఆంక్షలు విధించింది. ఇక నుంచి వారానికి రెండు రోజలు మాత్రమే ఢిల్లీ, ముంబైకి విమానాలు నడుస్తాయని బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం, శుక్రవారం మాత్రమే విమానాలు నడుస్తాయని తెలిపింది.. ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కారణంగానే ఈ నిర్ణయమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కొత్త మార్గదర్శకాలను ఇతరులకు కూడా తెలియజేశామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలు ఈ నెల ఐదు నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.