న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ మరో కీలక ప్రకటన చేసింది. పరీక్ష పేపర్ల లీక్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న సీజేపీ.. జూలై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తామని తెలిపింది. జంతర్‌మంతర్ వద్ద ప్రముఖ సామాజికవేత్త వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేపట్టి గురువారం నాటికి 11రోజులు పూర్తయ్యాయి. సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా మాట్లాడుతూ.. తాము శాంతియుత నిరసన చేపట్టాలని నిర్ణయించామన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా పోరాడుతామన్నారు.
నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. ‘నేను బతికి ఉండాలని మీరు కోరుకుంటే మొబైల్ ఫోన్లో మెసేజ్ పెట్టడం కాదు. ఢిల్లీకి వచ్చి మార్చ్‌లో పాల్గొనండి. మనందరం కలిసి చట్టాలు తయారయ్యే పార్లమెంట్ వద్ద మన వాయిస్‌ను వినిపిద్దాం’ అంటూ పిలుపునిచ్చారు.