India Alliance | ప్రతిపక్షాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ECI కి ఇండియా కూటమి ఫిర్యాదు..
India Alliance | ప్రతిపక్ష పార్టీల పట్ల అధికార బీజేపీ వ్యవహరిస్తున్న వైఖరిపై ఇండియా (INDIA) కూటమి భారత ఎన్నికల సంఘానికి (ECI) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, కూటమిలోని అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి శుక్రవారం భారత ఎన్నికల సంఘాన్ని కలిశారు.
India Alliance : ప్రతిపక్ష పార్టీల పట్ల అధికార బీజేపీ వ్యవహరిస్తున్న వైఖరిపై ఇండియా (INDIA) కూటమి భారత ఎన్నికల సంఘానికి (ECI) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, కూటమిలోని అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి శుక్రవారం భారత ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
కేంద్ర సర్కారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందని ఈ సందర్భంగా ఇండియా కూటమి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సమావేశం అనంతరం అభిషేక్ మనుసింఘ్వి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని గురువారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. అధికార పార్టీ తీరుపై ఎన్నికల సంఘంతో సమగ్రంగా చర్చించాం. ఇది ఒక వ్యక్తికి, పార్టీకి సంబంధించిన అంశం కాదు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు సంబంధించిన అంశమని అన్నారు.
75 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఇదే తొలిసారని సింఘ్వి చెప్పారు. కేంద్రం వైఖరిపై జోక్యం చేసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసం బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నదో ఈసీకి ఆధారాలతో సహా వివరించామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా డీజీపీని, సెక్రెటరీని మార్చే మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు కంట్రోల్ చేయలేరని ఎన్నికల సంఘాన్ని అడిగామని అన్నారు.
#WATCH | After meeting the Election Commission, Congress leader Abhishek Singhvi says, “Almost every opposition party is here. This incident happened late at night (arrest of Delhi CM). We have a detailed discussion with the election commission. This isn’t about an individual or… https://t.co/RnYWXTKnsd pic.twitter.com/DWv6f8WzHq
— ANI (@ANI) March 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

