ముంబై: దేశవ్యాప్తంగా హిందీ భాష అమలు వివాదంపై శివసేన(యూబీటీ) స్పందించింది. రాజ్ఠాక్రేతో ఏకతాటిపైకి వచ్చిన నేపథ్యంలో ఎంపీ సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేశారు. ముంబైలో హిందీకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీపై స్పష్టత ఇచ్చారు.
‘హిందీకి వ్యతిరేకమంటే వాళ్ల (స్టాలిన్)దృష్టిలో హిందీ మాట్లాడకూడదని, ఇతరులను మాట్లాడనివ్వకూడదని. కానీ మా వైఖరి అది కాదు. ప్రాథమిక విద్యా బోధనలో హిందీని బలవంతంగా రుద్దడానికి మాత్రమే మేం వ్యతిరేకం. మా పోరాటం పరిమితం’ అని తెలిపారు.