Arvind Kejriwal : గుజరాత్ (Gujarat) లోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి విమర్శలు గుప్పించారు. గుజరాత్లో నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. అక్రమ అరెస్టుల మూలంగా రాజ్కోట్ జైల్లో (Rajkot Jail) ఉన్న రైతులను కలిసేందుకు వెళ్లిన తనను అధికారులు అడ్డుకున్నారని, ఇది అక్కడి నియంతృత్వ పోకడకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుతం రాజ్కోట్ జైల్లో తాను కలిసేందుకు వెళ్లిన వాళ్లు రైతులని, నేరస్తులు కాదని అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, అక్కడి 54 లక్షల మందికి వ్యవసాయమే జీవనాధారమని వ్యాఖ్యానించారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను బలవంతంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆరోపించారు.
గుజరాత్ పోలీసులు మొత్తం 88 మంది రైతులను అరెస్ట్ చేశారని, వారిలో 42 మంది బెయిల్పై బయటికి వచ్చారని కేజ్రీవాల్ తెలిపారు. మిగతా రైతులు ఇంకా జైల్లోనే మగ్గుతున్నారని చెప్పారు.