న్యూఢిల్లీ : ఇకపై భారత జలాలు దేశం దాటి వెళ్లవని, దేశ ప్రయోజనాలకే వాటిని వినియోగించనున్నట్టు ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్తో సింధూ జలాల ఒప్పందం నిలిపివేతను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘ఇదివరకు భారత్కు దక్కాల్సిన నీటి వాటా బయటకు వెళ్లిపోయేది. ఇకపై మన జలాలు మన దేశ ప్రయోజనాలకే వినియోగిస్తాం’ అని స్పష్టంచేశారు.