నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ (Nashik) వద్ద గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆలయాలు నీటమునిగాయి. గోదావరి జన్మస్థలమైన నాసిక్- త్రయంబకేశ్వర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. నీటిమట్టం పెరడగంతో నాసిక్ వద్ద ఆలయాలు నీటమునిగాయి. నదిపై ఉన్న బ్రిడ్జిని ఆనుకుని నీరు ప్రవహిస్తున్నది. దీంతో ఇరువైపుల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నాసిక్‌లో ఆలయలు మునగడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.
గత నెల 11న కూడా మహారాష్ట్రలోని గోదావరి పరీవాహకం భారీ వర్షాలు కురిశాయి. దీంతో నాసిక్ వద్ద ఆలయాలు నీటమునిగాయి. కొన్నిరోజులపాటు ఆలయాలు నీటిలోనే ఉన్నాయి. కాగా, గత రెండునెలల్లో తెలంగాణలో కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. భద్రాచలం వద్ద 75 అడుగుల ఎత్తు మేర నది ప్రవహించింది. దీంతో భద్రాచలం నీటమునిగింది.
#WATCH | Maharashtra: Water level rises in Godavari river in Nashik, following incessant rainfall in the region. (01.09) pic.twitter.com/PpwISqvHsQ
— ANI (@ANI) September 2, 2022