Taj Mahal | దేశ రాజధాని ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 17వ శతాబ్దపు అద్భుత కట్టడం, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద, ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ (Taj Mahal) ప్రధాన డోమ్ (Main Dome) వద్ద వాటర్ లీక్ అవుతోంది (Water Leakage). తాజ్మహల్ ఆవరణలోని తోట కూడా వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది.
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. అయితే ఈ నీటి లీకేజీ వల్ల ఎలాంటి నష్టం లేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. నీటి లీకేజీలను, డోమ్ పరిస్థితిని డ్రోన్ కెమెరాల సాయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు తాజ్మహల్ ఆవరణలోని తోటను వరద ముంచెత్తిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Taj Mahal Gardens Submerged After Incessant Rain Hits Agra, watleakage from Taj Mahal’s main dome!
Water reached the tomb of shahjahan! pic.twitter.com/y3Ri7xHmOY
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 14, 2024
Also Read..
Aadhar Update | ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పొడిగింపు
Vande Bharat | ప్రధాని మోదీ ప్రారంభించనున్న వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. ఐదుగురు అరెస్ట్