న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భారత్.. తాజాగా చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుంచి నీటి సరఫరాను నిలిపివేసింది. జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ఆనకట్ట ద్వారా కూడా ఇదే తరహా చర్యలు తీసుకోవాలని భారత్ యోచిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
కాగా, జమ్ములోని రాంబన్‌లో ఉన్న బాగ్లిహార్, ఉత్తర కశ్మీర్లో ఉన్న కిషన్‌గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ఆనకట్టలు భారత్ దేశానికి నీటి విడుదల సమయాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని అందిస్తున్నాయి.