Ravneet Bittu : కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టు (Ravneet Bittu) రాజ్యసభ (Rajya Sabha) స్థానానికి నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. రాజస్థాన్ (Rajsthan) నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు. ఈ మేరకు బుధవారం ఉదయం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా రవ్నీత్ బిట్టూ వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రులు దియాకుమారి, ప్రేమ్ చంద్ బైర్వా, రాష్ట్ర మంత్రి జోగారాం పటేల్ ఉన్నారు. రవ్నీత్ బిట్టూ పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా ఎన్డీఏ సర్కారు మూడోసారి కొలుదీరినప్పుడు ప్రధాని మోదీ ఆయనకు మంత్రివర్గంలో చోటుకల్పించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయనను రాజ్యసభకు పంపుతున్నారు.
#WATCH | BJP’s Rajya Sabha by-election candidate from Rajasthan, Union Minister Ravneet Singh Bittu files his nomination in Jaipur. Rajasthan CM Bhajanlal Sharma, Deputy CMs Diya Kumari and Prem Chand Bairwa, and State Minister Jogaram Patel also with him.
(Video: Rajasthan… pic.twitter.com/D9Cy5k1PmG
— ANI (@ANI) August 21, 2024