Trains collided : పంజాబ్లో ఆదివారం ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో ఆ రైళ్ల బోగీలు కొన్ని బోల్తాపడ్డాయి. మరికొన్ని బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కాయి. ఈ ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన లోకోపైలట్లు తీవ్రంగా గాయపడ్డారు.
పంజాబ్ రాష్ట్రం సిర్హింద్ జిల్లాలోని మాధోపూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడ్డా లోకోపైలట్లను శ్రీ ఫతేగఢ్ సాహిబ్ సివిల్స్ ఆస్పత్రికి తరలించారు.
#WATCH | Punjab: Two goods trains collided near Madhopur in Sirhind earlier this morning, injuring two loco pilots who have been admitted to Sri Fatehgarh Sahib Civil Hospital. pic.twitter.com/0bLi33hLtS
— ANI (@ANI) June 2, 2024