Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi) భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. గోట్ ఇండియా టూరులో భాగంగా మెస్సి .. భారత్‌కు వచ్చాడు. ఇవాళ తెల్లవారుజామున పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ల్యాండ్ అయ్యారు. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు వేలాది మంది అభిమానులు ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఫుట్‌బాల్ స్టార్‌కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఓ కొత్త పెళ్లి కూతురు ప్రదర్శించిన ప్లకార్డు అందరి దృష్టిని ఆకర్షించింది.
మెస్సీ కోసం తన హనీమూన్‌ను వాయిదా వేసుకున్నానంటూ సదరు నూతన వధువు (Married couples) క్రేజీ ప్లకార్డును ప్రదర్శించింది. ఈనెల 5న వివాహం జరగ్గా.. హనీమూన్ వెళ్లాల్సి ఉంది. అయితే, మెస్సీ వస్తున్నాడన్న విషయం తెలిసి ఈ కొత్త జంట తమ హనీమూన్‌ను క్యాన్సెల్ చేసుకుంది (cancelled their honeymoon). ఈ విషయాన్ని ప్లకార్డు ద్వారా నూతన వధువు ప్రదర్శించింది. ‘జస్ట్ మారీడ్.. మెస్సీని చూసేందుకు హనీమూన్‌ను క్యాన్సెల్ చేసుకున్నాం’ అని రాసిఉన్న ప్లకార్డును సదరు మహిళ ప్రదర్శించింది. ఈ ప్లకార్డు అక్కడికి వచ్చినవారి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘గత శుక్రవారం (డిసెంబర్ 5)న మాకు వివాహం జరిగింది. మెస్సీ వస్తున్నాడని తెలిసి మా హనీమూన్‌ను వాయిదా వేసుకున్నాం. 2010 నుంచి ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని’ అంటూ మీడియాతో తన ఆసక్తిని పంచుకున్నారు కొత్త పెళ్లి కూతురు. ఇందుకు సంబంధించిన దృష్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
#WATCH | West Bengal | A fan of star footballer Lionel Messi says, “… Last Friday we got married, and we cancelled our honeymoon plan because Messi is coming as this is important… We have been following him since 2010…” pic.twitter.com/9UKx0K9dGy
— ANI (@ANI) December 13, 2025
Also Read..
IndiGo | ఇండిగో కీలక ప్రకటన.. బాధిత ప్రయాణికులకు రూ.500 కోట్ల పరిహారం
Pankaj Chaudhary: యూపీ బీజేపీ చీఫ్‌గా పంకజ్ చౌదరీ నియామకం !