Karunanidhi : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధ్యక్షుడు ఎం కరుణానిధి వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన కుమారుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో కరుణానిధి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ సోదరి, డీఎంకే లోక్సభ సభ్యురాలు కనిమొళి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తండ్రి చిత్రపటానికి నమస్కరించి పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా డీంఎకేకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ఇతర నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరుణానిధి వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో 2018 ఆగస్టు 7న కన్నుమూశారు.
#WATCH | Tamil Nadu: Tamil Nadu CM and DMK President MK Stalin pays tribute To Former Tamil Nadu CM and DMK leader M Karunanidhi on his 6th Death Anniversary.
(Source: Tamil Nadu DIPR) pic.twitter.com/AI7pNrODYz
— ANI (@ANI) August 7, 2024