Ratna Bhandar | జగన్నాథుడి ఆలయానికి ప్రత్యేక ట్రంకు పెట్టెలు.. ఇవాళ తెరుచుకోనున్న రత్న భాండాగారం..!
Ratna Bhandar | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలోగల రత్న భాండాగారం ఇవాళ తెరుచుకోనుంది. దాదాపు 46 ఏండ్ల తర్వాత ఈ రత్న భాండాగారాన్ని తెరువబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి పెద్ద ఎత్తున ప్రత్యేక ట్రంకు పెట్టెలను తెప్పించారు.
Ratna Bhandar : ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలోగల రత్న భాండాగారం ఇవాళ తెరుచుకోనుంది. దాదాపు 46 ఏండ్ల తర్వాత ఈ రత్న భాండాగారాన్ని తెరువబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి పెద్ద ఎత్తున ప్రత్యేక ట్రంకు పెట్టెలను తెప్పించారు. పాత చెక్కపెట్టెల్లోని ఆభరణాలు, ఆస్తులను కొత్త పెట్టెల్లోకి మార్చనున్నారు.
జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరువాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఒడిశా సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీక్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్లు చేపడతారు. రత్న భాండాగారాన్ని తెరిచే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకూడదని నిర్ణయించారు.
ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈ నె 19 వరకు వరకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది..? ఎవరెవరు పాల్గొంటారు..? భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా..? తదితర వివరాలు వెల్లడికాలేదు. భాండాగారం తలుపులు తెరవడానికి ఎంతమంది వెళ్తారన్న దానిపై కూడా స్పష్టత లేదు.
అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి ఇవాళ ముందుగా మార్గదర్శకాలు జారీ కానున్నాయని, ఆ మార్గదర్శకాలను ప్రకారం రత్నభాండాగారాన్ని తెరుస్తారని ఒడిశా న్యాయశాఖ మంత్రి తెలిపారు. రత్న భండాగారంలో ఆస్తుల వివరాల నమోదును ఈసారి డిజిటలైజేషన్ చేయిస్తామని చెప్పారు.
#WATCH | Puri, Odisha: Special boxes brought to Shri Jagannath Temple ahead of the re-opening of Ratna Bhandar.
The Ratna Bhandar of the Shri Jagannath Temple is to be opened today following Standard Operating Procedure issued by the state government. pic.twitter.com/xwRdtQe0Ml
— ANI (@ANI) July 14, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

