Rahul Gandhi : లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు (Opposition leader) , కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మంగళవారం ఢిల్లీలోని తన నివాసం నుంచి కేరళ (Kerala) లోని వాయనాడ్ (Wayanad) కు బయలుదేరాడు. తన సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి ఆయన వాయనాడ్‌కు వెళ్తున్నారు. బుధవారం వాయనాడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకాగాంధీ వాద్రా నామినేషన్ (Nomination) వేయనున్నారు. ఈ నేపథ్యంలో సోదరితో కలిసి రాహుల్‌గాంధీ వాయనాడ్‌కు బయలుదేరారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ వాయనాడ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీచేశారు. రెండు స్థానాల్లోనూ ఆయన విజయం సాధించారు. దాంతో రాయ్‌బరేలీ స్థానాన్ని అట్టిపెట్టుకుని, వాయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన వాయనాడ్ ప్రజలు మాట ఇచ్చారు. తాను రాజీనామా చేసినా తాను ఇక్కడి ప్రజలకు దూరం కాబోనని, ఇక్కడి నుంచి తన సోదరిని బరిలో దించుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ ప్రియాంకాగాంధీని వాయనాడ్ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది.
#WATCH | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi along with Congress leader Priyanka Gandhi Vadra leave for Kerala’s Wayanad from Delhi airport.
Congress candidate for Wayanad Lok Sabha by-elections Priyanka Gandhi Vadra will file her nomination papers tomorrow, October 23. pic.twitter.com/i5MweiUQqx
— ANI (@ANI) October 22, 2024