డెహ్రాడూన్: పార్టీలో పరిస్థితులు చక్కబడాలని దైవాన్ని కోరుతూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీష్ రావత్ భక్తుల చెప్పులు తూడ్చాడు. హరీష్ రావత్ ఇవాళ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా ఏరియా సమీపంలోగల నానక్‌మట్ట గురుద్వారాకు వెళ్లారు. అక్కడ భక్తులు విడిచిన పాదరక్షలను శుభ్రం చేశారు. అనంతరం చీపురుపట్టి గురుద్వారాలోని ఫ్లోర్‌ను తూడ్చారు.
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య వర్గపోరు మొదలైంది. ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిధ్దూ రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి సమస్యను పరిష్కరించడం హరీష్ రావత్‌కు తలకుమించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో గత బుధవారం ఆయన.. పంజాబ్‌లో పార్టీ వ్యవహారాలు చక్కబడాలని కోరుతూ గురుద్వారాలో ఫ్లోర్ ఊడ్చనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు పంజ్ ప్యారే పేరుతో ఇవాళ ఫ్లోర్‌ను తూడ్చడంతోపాటు భక్తుల చెప్పులు క్లీన్ చేశారు.
#WATCH | Punjab Congress in-charge Harish Rawat cleans shoes of devotees, sweeps the floor of Nanakmatta Gurudwara near Khatima in Udham Singh Nagar, Uttarakhand
— ANI (@ANI) September 3, 2021
On Sept 1, he announced to sweep the floor of a gurudwara for referring to Punjab party functionaries as "Panj Pyare" pic.twitter.com/MvK97dtbNT