Farmers protest : పలు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ పంజాబ్-హర్యానా నడుమగల శంభూ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు శంభూ సరిహద్దులకు చేరుకుని.. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు.
దాంతో ఆందోళనకారులు పరుగులు తీశారు. పలువురు సొమ్మసిల్లి కిందపడిపోయారు. పోలీసులు, రైతుల ఉరుకులు, పరుగులతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. కాగా వ్యవసాయ సంస్కరణల ద్వారా తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఇవాళ చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు.
#WATCH | Police use tear gas to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border.
The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/TQyigtUF6K
— ANI (@ANI) December 6, 2024