Bomb threat : కేరళ రాష్ట్రం (Kerala state) లోని కొట్టాయం జిల్లా కలెక్టరేట్ (Kottayam collectorate) కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు కొట్టాయం కలెక్టరేట్‌కు ఫోన్ చేసి బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ (Bomb squad) ను రప్పించి తనిఖీలు చేపట్టారు.
బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో కలెక్టరేట్లోని అధికారులు, సిబ్బంది.. కలెక్టరేట్లో వివిధ పనుల నిమిత్తం వచ్చిన జనం అందరూ బయటికి పరుగులు తీశారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేసి బాంబులేమీ లేవని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలోపడ్డారు.
#WATCH | Kerala: Police team and bomb squad arrived at the Kottayam collectorate and carried out an inspection after the Kottayam collectorate received a bomb threat. pic.twitter.com/Fkt3RxrZWe
— ANI (@ANI) April 24, 2025