Sharad Pawar : ఇవాళ (శనివారం) తెల్లవారుజామునే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) ఇంటి ముందు జనం భారీగా గుమిగూడారు. బారామతి (Baramati) లోని ఆయన నివాసం ముందు జనం పూల బొకేలతో ఎదురుచూస్తూ కనిపించారు. దివాళీ పడ్వ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పోటీపడ్డారు.
కాగా మహారాష్ట్రలో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రెండు కూటముల్లో మూడేసి పార్టీలు సీట్లు పంచుకుని బరిలో దిగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను నవంబర్ 23న లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా ఇవాళ శరద్ పవార్ ఇంటి ముందు జనం గుమిగూడిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Maharashtra: People arrive at the residence of NCP-SCP chief Sharad Pawar to greet him on the occasion of Diwali Padwa, in Baramati pic.twitter.com/oZ0o72bhhM
— ANI (@ANI) November 2, 2024