Road accident | అదుపు తప్పి బస్సు బీభత్సం.. ఒకరు దుర్మరణం.. కారు, బైకులు ధ్వంసం.. Video
Road accident | దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ మితిమీరన వేగంతో నడపడంతో అదుపు తప్పిన ఓ బస్సు.. బీభత్సం సృష్టించింది. ఒక కారు, పలు బైకుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక బైకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ మితిమీరన వేగంతో నడపడంతో అదుపు తప్పిన ఢిల్లీ రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్ (DTC) బస్సు.. బీభత్సం సృష్టించింది. ఒక కారు, పలు బైకుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక బైకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, బస్సు ఢీకొట్టడంతో కారు, పలు బైకులు ధ్వంసమయ్యాయి. ఢిల్లీలోని రోహిణి ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు..
#WATCH | One person died after being hit by a DTC bus in Delhi’s Rohini area. Further investigation is underway: Delhi Police
(CCTV visuals confirmed by police) pic.twitter.com/Bt1ipo9GYr
— ANI (@ANI) November 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

