MI vs SRH : వాంఖడేలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) స్టార్ సూర్యకుమార్ యాదవ్(59) అర్ధ సెంచరీ బాదాడు. 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో సూర్య ఫిఫ్టీ సాధించాడు. 31 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో తిలక్ వర్మ()తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.
హైదరాబాద్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముంబై స్కోర్‌బోర్డును పరగులు పెట్టించాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 88 రన్స్ జోడించారు. దాంతో, ముంబై 13 ఓవర్లకు 119 రన్స్ కొట్టి విజయానికి చేరువైంది.