Dinesh Kumar : పాకిస్థాన్ (Pakistan) సరిహద్దుల్లో అమరుడైన భారత జవాన్ (Indian soldier) లాన్స్ నాయక్ (Lance Naik) దినేశ్ కుమార్ (Dinesh Kumar) పార్థివదేహం స్వగ్రామానికి చేరుకుంది. ఆర్మీ వాహనంలో దినేశ్ కుమార్ పార్థివ దేహాన్ని హర్యానా (Haryana) లోని పల్వాల్ (Palwal) కు తీసుకొచ్చారు. ఆ సమయంలో దినేశ్ కుమార్ను చూసేందుకు జనం భారీ సంఖ్యలో వచ్చారు. యువకులు దినేశ్ పార్థివదేహాన్ని తీసుకొచ్చిన వాహనం వెంట బైకులపై ర్యాలీగా తరలివచ్చారు.
ఈ నెల 7న ఉదయం పాకిస్థాన్ సైనికులు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఒక్కసారిగా భారత సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిని భారత జవాన్లు తిప్పికొట్టారు. దాంతో పాక్ సైనికులు పారిపోయారు. అయితే ఈ కాల్పుల్లో లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
#WATCH | Palwal, Haryana: Mortal remains of Lance Naik Dinesh Kumar brought to his native village in Palwal
Lance Naik Dinesh Kumar laid down his life on 07 May 2025 during ceasefire violations by the Pakistan Army along the Line of Control. pic.twitter.com/y6fk1DIeEX
— ANI (@ANI) May 8, 2025