బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువకుడు తను చేసిన యాక్సిడెంట్ నుంచి తప్పించుకునేందుకు ఓ వృద్ధుడిని స్కూటీతోపాటు కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. బెంగళూరులోని మగది రోడ్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మగది రోడ్డులో ఓ యువకుడు తన స్కూటీతో వృద్ధుడి వాహనాన్ని ఢీకొట్టాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తర్వాత తప్పు తనదేనని గ్రహించిన యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో వృద్ధుడు స్కూటీని వదలకుండా వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. అయినా, ఆ యువకుడు ఆగకుండా వృద్ధుడిని స్కూటీతో ఈడ్చుకెళ్లాడు.
ఆ రోడ్డులో వెళ్తున్న వాహనదారులు ఇది గమనించి కేకలు వేసినా యువకుడు పట్టించుకోలేదు. దాంతో తమ వాహనాలను అడ్డుపెట్టి స్కూటీని ఆపేశారు. సమాచారం అందుకున్న గోవిందరాజ్నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. గాయపడిన వృద్ధుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఆ దారుణ ఘటనను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Man being dragged behind a scooter on Bengaluru’s Magadi road
The victim is currently under medical treatment a city hospital. The two-wheeler driver has been apprehended by the police at PS Govindaraj Nagar: DCP West Bengaluru
(Video verified by Police) pic.twitter.com/nntPxaZxSu
— ANI (@ANI) January 17, 2023