రూర్కెలా, జనవరి 10: రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళుతున్న ఇండియా ఒన్ ఎయిర్‌కి చెందిన 9 సీటర్ల చార్టర్డ్ విమానం శనివారం ఒడిశాలో కూలిపోయింది. పైలట్ సహా ఏడుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం తెలియరాలేదు. ఆరుగురు ప్రయాణికులు, ఒక పైలట్‌తో వెళుతున్న విమానం రూర్కెలా నుంచి టేకాఫ్ అయిన 10-15 నిమిషాలకే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సహాయక బృందాలు ప్రమాద స్థలిని చేరుకుని ప్రయాణికులను దవాఖానకు తరలించాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజిన్ ఫెయిల్ కావడంతో అద్దె విమానం జలధ వద్ద పంట పొలాల్లో కూలిపోయింది. పరిస్థితిని అంచనా వేసేందుకు పర్యాటక శాఖకు చెందిన బృందం కూడా భువనేశ్వర్ నుంచి రానున్నట్లు తెలిసింది.