న్యూఢిల్లీ: తీవ్ర చలితో ఢిల్లీ గజగజ వణుకుతున్నది. శనివారం 4.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతతో జనవరిలో అతి శీతల దినంగా నమోదైంది. ఈ శీతాకాలంలో ఇదే అతి కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా. మరోవైపు చలి తీవ్రతకు జమ్ము కశ్మీర్ కూడా వణికిపోతున్నది. కొన్ని ప్రాంతాల్లో అయితే మైనస్ డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి. సరస్సులు, కొలనుల్లో నీరు గడ్డకట్టుకుపోయింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం దాల్ సరస్సు చలి తీవ్రతకు గడ్డ కట్టింది.