Sawan Month | ఉత్తరాదిలో శ్రావణ మాసం మొదలు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. బారులు తీరిన భక్తులు.. Videos
Sawan Month | ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రావణ మాసం ఆరంభమైంది. శ్రావణ మాసం తొలిరోజు కావడంతో ఇవాళ ఉదయం నుంచే ఆలయాల్లో అర్చకులు మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రావణ మాసం ఆరంభమైంది. శ్రావణ మాసం తొలిరోజు కావడంతో ఇవాళ ఉదయం నుంచే ఆలయాల్లో అర్చకులు మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలను పూలు, పత్రాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. భక్తులు భారీగా ఆలయాలకు తరలివచ్చారు. కొన్ని ఆలయాల్లో దైవదర్శనం కోసం భక్తులు బారులుతీరారు.
దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్ ఏరియాలోగల శ్రీ గౌరీశంకర్ ఆలయంలో కూడా ఈ తెల్లవారుజామున ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పూలు, పండ్లు, పత్రాలతో ఆలయాన్ని అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శంకరుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. శివలింగానికి పాలు, జలంతో అభిషేకాలు చేశారు.
#WATCH | Delhi: Devotees offer prayers at Shree Gauri Shankar Temple in Chandni Chowk on the first day of ‘Sawan’ month. pic.twitter.com/GrzCZXI4V0
— ANI (@ANI) July 4, 2023
#WATCH | Delhi: Devotees throng Shree Gauri Shankar Temple in Chandni Chowk to offer prayers on the first day of ‘Sawan’ month. pic.twitter.com/vJZ5yv0nEr
— ANI (@ANI) July 4, 2023
ఇక మధ్యప్రదేశ్లోగల ఉజ్జయినీ మహాకాళేశ్వర్ ఆలయంలో కూడా ఈ తెల్లవారుజామునే ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అర్చకులు హారతి, భస్మహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈశ్వరుడి దర్శనం కోసం భక్తుల భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిలబడి శివయయ్యను దర్శించుకున్నారు.
#WATCH | Delhi: Devotees offer prayers at Shree Gauri Shankar Temple in Chandni Chowk on the first day of ‘Sawan’ month. pic.twitter.com/GrzCZXI4V0
— ANI (@ANI) July 4, 2023
#WATCH | Madhya Pradesh: ‘Bhasma Aarti’ performed at Shree Mahakaleshwar Temple in Ujjain, on the first day of ‘Sawan’ month. pic.twitter.com/v3kXYJ7cUD
— ANI (@ANI) July 3, 2023
అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్య పట్టణంలోని నాగేశ్వర నాథ్ ఆయలంలో కూడా శ్రావణ మాసం ఆరంభం సందర్భంగా ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీ తరలివచ్చి పాలు, పుష్పాలతో అభిషేకాలు చేశారు.
#WATCH | Uttar Pradesh | Devotees offer prayers at Nageshwar Nath Temple in Ayodhya on the first day of ‘Sawan’ month. pic.twitter.com/Nbut7mEtBQ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

