Kannappa Movie | మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. రీసెంట్గా మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా వదిలారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్‌లో విష్ణు జలపాతం నుంచి ఎంట్రీ ఇస్తూ.. బాణంను ఎక్కుపెట్టినట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. తాజాగా మూవీకి సంబంధించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో బాలీవుడ్ ఖిలాడీ, నటుడు అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అక్షయ్ కుమార్. అయితే ఈ సినిమా కోసం ఏప్రిల్ 16 నుంచి షూటింగ్లో పాల్గోంటున్నాడు అక్షయ్. తాజాగా అతడి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈసందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను మంచు విష్ణు ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
What a shoot it has been with @akshaykumar. Learnt. Laughed. And now missing the action. Looking forward for many more.#𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚🏹 pic.twitter.com/lUzBfydcHx
— Vishnu Manchu (@iVishnuManchu) May 3, 2024
విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న కన్నప్పలో మోహన్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ ఇతర నటీనటులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.